Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

09-02-2025 నుంచి 15-02-2025 వరకు ఫలితాలు.. అపజయాలకు కుంగిపోవద్దు..

Advertiesment
Weekly Horoscope

రామన్

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (20:52 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. సాయం అర్థించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సంతానం చదువులపై దృష్టి సారించండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్పటిమతో నెట్టుకొస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త యత్నాలు ప్రాంభిస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒత్తిడికి గురికాకుండా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. బుధవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థలకు ఏకాగ్రత ప్రధానం. నూతన వ్యాపారాలపై దృష్టిపెడతారు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చు, తాయి. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. అయిన వారి కోసం శ్రమిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సోమవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, బలపడతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు మంచి ఫలితాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లును సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త పనులు మొదలెడతారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యులు అపార్ధాలకు దారితీస్తాయి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. నోటీసులు అందుకుంటారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీ. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు నెరవేరవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మంగళవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయస్తులతో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అధికారులకు ఒత్తిడి, ఆందోళన అధికం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం తలపెడతారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. లావాదేవీలతో సతమతమవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కారక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సోమ, మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వాగ్వాదాలకు దిగవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నూతన వ్యాపారాలు చేపడతారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం యోగదాయకం. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెటండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం సమస్యలకు దారితీస్తుంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వేడుకకు హాజరవుతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో శ్రమించండి. ఇతరులను తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో షధనం నిలవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. సంతానానికి శుభం జరుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు చేపడతారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఆడిటర్లు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశయసాధనకు సంకల్ప బలం ముఖ్యం. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా అడుగుముందుకేయండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. శుక్రవారం నాడు కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ధనప్రలోభాలకు లొంగవద్దు. మిమ్ములను మోసగించేందుకు కొందరు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మీ పరధ్యానం తప్పిదాలకు దారితీస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-02-2025 శనివారం దినఫలితాలు- పొగిడే వ్యక్తులను నమ్మవద్దు...