Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-01-2025 నుంచి 01-02-2025 వరకు వార రాశి ఫలాలు...

Advertiesment
weekly astrology

రామన్

, శనివారం, 25 జనవరి 2025 (21:38 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితమిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. శుక్రవారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాదనలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమతో కూడిన విజయాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియత్రించుకుంటారు. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆదివారం నాడు మితంగా సంభాషించండి. అంతరంగిక విషయాలు వెల్లడింవద్దు. కొంతమంది మీ నుంచి విషయం రాబట్టేందుకు యత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమర్ధతను కనబరుస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి అనుకూలిస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సోమ, మంగళవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతాధికారులకు ఒత్తిడి, ఆందోళన అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనువజ్ఞుల సలహా తీసుకోండి. బుధవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కర్తవ్య నిర్వహణపై దృష్టి పెట్టండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. రుణసమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. శనివారం నాడు చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం కార్యోన్ముఖులను చేస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టేన్సీలను ఆశ్రయించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. సాయం ఆశించవద్దు. సంతానం భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ శ్రీమతి అభిప్రాయానికి ప్రాధాన్యమివ్వండి. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. నోటీసులు అందుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. కిట్టని వారు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య కొలిక్కివస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. కలిసివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సన్నిహితుల వ్యాఖ్యులు కార్యోన్ముఖులను చేస్తాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. బుధవారం నాడు నగదు, పత్రాలు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది దూరపు బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుక్రవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టకాలం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మనోధైర్యంతో మెలగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, శనివారాల్లో పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా వారికి నచ్చచెప్పండి. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సోమవారం నాడు అందరితోను మితంగా సంభాషించండతి. "మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. విమర్శలకు స్పందించవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Abhijit Muhurat: అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? మధ్యాహ్నం పూట ఇవి చేస్తే?