Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-01-2025 నుంచి 25-01-2025 వరకు వార ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు

Advertiesment
Weekly Horoscope

రామన్

, ఆదివారం, 19 జనవరి 2025 (07:31 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. గురువారం నాడు పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. పరిచయస్తులతో తరుచు సంభాషిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కర్కాటకం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం ఆశాజనకం. లావాదేవీలు పురోగతిన సాగుతాయి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలెదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానానికి శుభఫలితాలున్నాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆదివారం నాడు ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహమార్పు అనివార్యం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. యోగ, ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మంగళవారం నాడు ఆచితూచి అడుగేయాలి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరం. సంస్థల స్థాపనలకు అనుతులు మంజూరవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. బెట్టింగ్లకు పాల్పడవద్దు
 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం సంతృప్తికరం. బుధ, గురు వారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం ప్రశాంతత పొందుతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. పురస్కారాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. శుక్రవారం నాడు అపరిచితులతో జాగ్రత్త. వాదోపవాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు అనివార్యం. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక కోసం నిరీక్షిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దూరప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా ఇబ్బంది లేకున్నా ధనం మితంగా వ్యయం చేయండి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొదుపు పథకాలపై దృష్టి పెట్టండి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఆది, సోమ వారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, ఏజెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. ఆప్తులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు చేరువవుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. శుక్రవారం నాడు నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు స్థానచలనం. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఓర్పు, పట్టుదలతో ఉద్యోగయత్నాలు సాగించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారుకు కొత్త సమస్యలు. మెలగండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు పనులు లభిస్తాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి