మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం వ్యయంలో జాగ్రత్త. సోమవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ధ్యాస ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. గురువారం నాడు ఒక సంఘటన ఆందోళనకు గురిచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిసారించండి. గృహమార్పు అనివార్యం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు అందుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. తరుచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగ పరంగా మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన అధికం.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్నేహసంబంధాలు బలపడతాయి. సోమవారం నాడు పెద్దఖర్చు తగిలే అస్కారం ఉంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా ఆలోచింపవద్దు. ఆహార నియమాలు కచ్చితంగా పాటించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్ల పూర్తి చేస్తారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆది, సోమ వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. మధ్యవరులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దూరపు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఉద్యోగస్తులకు కొత్తబాధ్యతలు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గురు, శుక్ర వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ దృష్టి మరల్చేందుకు కొందరు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. ఆదివారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది, ధనం మితంగా వ్యయం చేయండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి, నూతన పెట్టుబడులకు అనుకూలం. వేడుకలో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులు మొదలెడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు అవకాశం లేదు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త, ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. మంగళ, బుధ వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆత్యీయులతో తరచుగా సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగపరంగా మంచి శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని ఏమరుపాటుగా వదిలి వెళ్లకండి
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. లావాదేవీలతో తీరిక ఉండదు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కీలక పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహమార్పు అనివార్యం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల ఆగ్రహావేశాలకు గురవుతారు. సహోద్యోగుల సాయంతో సమస్య సద్దుమణగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
మీన : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.