శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయ పాలకమండలి శుభవార్త చెప్పింది. ఆలయ అభివృద్ధి చర్యల్లో భాగంగా కొత్త డిజైన్‌ను రూపొందించారు. ఇందులోభాగంగా, సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైవర్‌ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వానిసన్నిధిలోకి అనుమతిస్తారు.
ఇప్పటివరకు భక్తులు పదునెట్టాంపడి ఎక్కగానే ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో ఉండే ఫ్లై ఓవర్ మీదుగా సన్నిధానం చేసుకోవాల్సి వచ్చింది. ఇపుడు వంతెనను తొలగించడంతో మెట్లు ఎక్కువగానే స్వామి దర్శనం చేసుకోవచ్చు.
మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అపుడు ఇరుముడితో వెళ్లే 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్లదారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్‌పుర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్పసన్నిధి చేరుకోవచ్చు.
ప్రస్తుతం ఫ్లై ఓవర్ దిగాక అయ్యప్పసన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినపుడు మాత్రమే రెండుమూడు సెకన్ల పాటు స్వామి దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు.