Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-10-2022 నుంచి 05-11-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (Video)

Advertiesment
kanya rashi
, శనివారం, 29 అక్టోబరు 2022 (22:31 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. బుధ, గురు వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కష్టం వృధా కాదు. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులకు తరుణం కాదు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సోమ, మంగళ వారాల్లో పనులు సాగవు. మీ శ్రీమతి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి శుభయోగం. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
 
ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. సాహసించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితమిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు 
అర్ధాంతంగా ముగిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. క్రీడాకారులకు ప్రోతహకరం. 
 
 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
 
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. గృహంలో మార్పులు చేపడతారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. రిప్రజెంటేటిు టారెట్లను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. పందాల జోలికి పోవద్దు. 
 
 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
 
కుటుంబ సౌఖ్యం. ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సమయస్పూర్తితో వ్యవహరించాలి. సలహాలు, సహాయం అడుగవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. శనివారం నాడు ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. అభియోగాలు ఎదుర్కుంటారు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుందిజ నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. 
 
 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
 
గ్రహాల సంచారం బాగుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమ వారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
 
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
 
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉపాధి అవకాశాలు చేపడతారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆది, గురు వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. సన్నిహితుల హితవు మీపై సత్ర ప్రభావం చూపుతుంది. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. రిప్రజెంటేటివోకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. బిల్డర్లకు కష్టసమయం. వాహనదారులకు దూకుడు తగదు, 
 
 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
 
అనుకూలతలు అంతంత మాత్రమే. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. శుక్ర, శని వారాల్లో కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతను చాటుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
 
సంకల్పం సిద్ధిస్తుంది. బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఒత్తిడి అధికం. సంప్రదింపులు చర్చలు అర్ధాంతంగా ముగుస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులు, స్టాకిస్టులకు నిరాశాజనకం. 
 
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
 
ఈ వారం కొంతమేరకు అనుకూలదాయకం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయం సంతృప్తికరం, రోజువారీ ఖర్చులే ఉంటాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. సంతానం ధోరణి విసుగుకలిగిస్తుంది. అనునయంగా మెలగండి. సంప్రదింపులకు అనుకూలం. ఏ విషయాన్నీ తెగే వరకు లాగవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. రిప్రజెంటేటివలు టార్గెట్లను అధిగమిస్తారు. ప్రయాణం ప్రశాంతంతగా సాగుతుంది. 
 
 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. కిట్టని వారితో జాగ్రత్త. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్దానికి గురిచేస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి కొత్త పనులు లభిస్తాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-10-2022 శనివారం దినఫలాలు - సుబ్రమణ్యస్వామిని పాలతో అభిషేకించిన...