Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-10-2022 నుంచి 29-10-2022 వరకు మీ వార రాశిఫలితాలు (video)

Advertiesment
Weekly astrology
, శనివారం, 22 అక్టోబరు 2022 (14:08 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఎవరి సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. బుధ, గురు వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. శుక్ర, శని వారాల్లో ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. బంధుమిత్రులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితమీయవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వేడుకకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. ప్రియతములతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. సోమ, మంగళ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సోదరీ సోదరులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. జాతక పొంతన ప్రధానం. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే
 శ్రేయస్కరం. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
సంకల్పం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. వేడుకకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. గృహమార్పు అనివార్యం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను చక్కని స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకుల మినహా ఇబ్బందులుండవు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ప్రతికూలతలు అధికం. నిస్తేజానికి లోనవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. మంగళ, బుధ వారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్మాతిక విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వృత్తులు, కార్మికులకు నిరాశాజనకం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆచితూచి వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. సంతానం విషయంలో మేలు జరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. గురు, శుక్ర వారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్పలితమిస్తాయి. ఉపాధ్యాయులకు కష్టసమయం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్ సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు సందన లభిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, పనివారలకు నిరాశాజనకం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి, వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం . ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు కొనసాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆది, శని వారాల్లో పనులు సాగవు. ఖర్చులు విపరీతం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. దంపతుల మధ్య అవగాహన లోపం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మీ ప్రణాళికలు ఆశించిన ఫలితమీయవు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి.
 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులో ఒత్తిడి, శ్రమ అధికం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. సోమ, మంగళ వారాల్లో వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆప్తులకు కీలక సమాచారం అందిస్తారు. పత్రాల రెన్యువలో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏజెంట్లు, రిప్రజెంటేటిన్లు టార్గెట్లను అధిగమిస్తారు. జూదాలు, బెట్టింగ్ కు పాల్పడవద్దు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనత్రయోదశి.. శని మకరరాశిలో డబ్బు రాకకు కొత్త మార్గాలొస్తాయ్