మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం శుభదాయకం. ఆదాయం బాగుంటుంది. వస్త్ర. వెండి బంగారాలు కొనుగోలు చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. గత అనుభవంతో తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దైవకార్యానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల జోలికి పోవద్దు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహ సందడిగా ఉంటుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. కొత్తయత్నాలు చేపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. దైవకార్యంలో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. వస్త్ర, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. శనివారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల పదోన్నతి, బాధ్యతల మార్పు. ప్రైవేట్ ఉద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్ధికంగా ఆశించిన ఫలితాలుంటాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలు ఎదుర్కుంటారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల జోలికి పోవద్దు. దూరపు బంధువులను కలుసుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పెద్దల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. లక్ష్యసాధనకు అవిశ్రాతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మంగళ, బుధవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానానికి శుభయోగం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహనిర్మాణం చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావద్దు. మీ నిర్ణయంపైనే సంతానం భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెద్దల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. శుక్రవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వెండి బంగారం కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మీరు నిర్ణయంపై సంతానం భవిష్యత్తు ముడిపడి ఉంది. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మోహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. నోటీసులు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సత్కాలం సమీపించింది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు పనులు ముందుకు సాగవు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుతుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక వార్త నిరుత్సాహపరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. లక్ష్యసాధనకు చేరువలో ఉన్నారు. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఉత్పాంగా ముందుకు సాగుతారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. ఎదురుచూస్తున్నత పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెట్టుబడులు కలిసిరావు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలెదుర్కుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆహ్వానం అందుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆది, సోమవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఎదుటివారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తులకు ఒత్తిడి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విందులకు హాజరవుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలగుతుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. గురువారం నాడు అనవసర బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులు ఎదుర్కుంటారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శుక్రవారం నాడు పనులు పురమాయించవద్దు సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి ఉన్నత విద్య, ఉద్యోగయోగం. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే అవకాశాలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తగిన సమయం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.