Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

Advertiesment
Astrology

రామన్

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సొంత నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు. ఒక సంఘటన ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. చాకచక్యంగా మెలగండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకకు హాజరవుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పొగడ్తలకు లొంగవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కీలక సమావేశంలో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారం అనుకూలిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. బాధ్యతగా మెలగండి. ఎవరినీ నిందించవద్దు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవలసి వస్తుంది. ధనలాభం ఉంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ధన సహాయం తగదు. సన్నిహితులను సంప్రదించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. ఆశించిన అవకాశం చేజారిపోతుంది. మనోధైర్యంతో యత్నాలు కొనసాగించండి. నిస్తేజానికి లోను కావద్దు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పాత మిత్రుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అధికం. ముఖ్యలను కలిసినా ఫలితం ఉండదు. దంపతుల మధ్య కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పంతాలకు పోవద్దు. ఎదుటివారి మాటకు విలువ ఇవ్వండి. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనివారల వైఖరి చికాకుపరుస్తుంది. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇంటి విషయాలపై దృష్టిపెట్టండి. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?