Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-03-2021 నుంచి 13-03-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

Advertiesment
07-03-2021 నుంచి 13-03-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 6 మార్చి 2021 (22:16 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పరిచయాలు బలపడతాయి. సంప్రదింపులకు అనుకూలం. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం చదువులపై శ్రద్ద వహించండి. పెట్టుబడులు కలిసిరావు. వ్యాపారాభివృద్దికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. అప్రయత్నంగా అవకాసాలు కలిసివస్తాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. వస్తువులు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వ్యాపకాలు విస్తరిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. వీలైనంతవరకూ ప్రియతములతో కాలక్షేపం చేయండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. మంగళ, బుధ వారాలలో అప్రమత్తంగా వుండాలి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ధనం మితంగా వ్యయం చేయండి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. పాత పరిచయస్తులు తారసపడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఆది, గురువారాల్లో పనులతో సతమతమవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఫోన్ సందేశాలు విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆర్థిక వివరాలు గోప్యంగా వుంచండి. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం వుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. మార్కెటింగ్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదు. చిన్నచిన్న సమస్యలెదురవుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమ, మంగళ వారాల్లో పనులు, బాధ్యతలు అప్పంగించవద్దు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. సంస్థల స్థాపనకు అనుకూలం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిని మొక్కులు తర్చుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. ప్రతికూలతలు తొలగుతాయి. మీ కృషి స్ఫూర్థిదాయకమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు శుభయోగం. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పెద్దల సలహా పాటిస్తారు. గురు, శుక్ర వారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయివారితో ఉత్సాహంగా గడుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. దస్త్రం ముహూర్తం నిశ్చయమవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులతో జాగ్రత్త. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఆదాయానికి తగ్గట్లు ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యవహారాల్లో మీదే పైచేయి. ధనలాభం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. శని, ఆది వారాలలో అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు పురోగతిన సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కొంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సోమ, మంగళ వారాలలో కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం వుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. రవాణా, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మకరం: ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పనులు సానుకూలమవుతాయి. బుధ, గురు వారాల్లో అనవసరం జోక్యం తగదు. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుకకు ముహూర్తం నిశ్చయమవుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ప్రయాణంలో అవస్థలెదుర్కొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. శుక్ర, శనివారాల్లో ఖర్చులు అధికం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యాపారాలలో నష్టాలను భర్తీ చేసుకుంటారు. షాపు పనివారలతో జాగ్రత్త. నిరుద్యోగులకు శుభయోగం. కార్మికులు, చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యవహార దక్షతతో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు అదుపులో వుండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. ఆదివారం నాడు పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. మీ ప్రేమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్య సౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక, రవాణా రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వైద్య, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమనీయం.. కళ్యాణ వేంకటేశ్వరుడి గరుడసేవ