Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-12-2020 నుంచి 12-12-2020 వరకూ మీ వార రాశి ఫలితాలు- video

Advertiesment
06-12-2020 నుంచి 12-12-2020 వరకూ మీ వార రాశి ఫలితాలు- video
, సోమవారం, 7 డిశెంబరు 2020 (11:56 IST)
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యానుకూలత అంతంతమాత్రమే. ఆశావహ దృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహం చెందవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. అకారణంగా మాట పడాల్సి వస్తుంది. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. శని, ఆది వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. డబ్బుకి ఇబ్బంది వుండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. పెట్టుబడులు కలిసిరావు. దంపతుల మధ్య అవగాహన లోపం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పందాలు, బెట్టింగులకు దూరంగా వుండాలి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలతలు వున్నాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. సంతానం దూకుడు అదుపు చేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. కార్మికులు, కూలీలకు ఆశాజనకం. వేడుకల్లో ఆప్తులను కలుసుకుంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. సహోద్యోగుల ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. సోమ, మంగళ వారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. బంధువులు ధన సహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. గృహమార్పు చక్కని ఫలితమిస్తుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం చికాకుపరుస్తుంది. ఎవరినీ నిందించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరికి వుండదు. అకాల భోజనం, పనిభారం. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బుధ, గురు వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవుతుంది. అభినందనలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. శుక్రవారం నాడు అప్రమత్తంగా వుండాలి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. ఆప్తుల పలకరింపు ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో అశ్రద్ధ తగదు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు శుభయోగం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
తుల: చిత్ర 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. ఆది, సోమ వారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా వుంటాయి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సాంకేతిక, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం, మంచి చేసినా మాట పడాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మంగళ, బుధ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలువదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడుతారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. గురు, శుక్ర వారాల్లో సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పథకాలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. శని, ఆది వారాల్లో ప్రముఖుల సందర్శన వీలుపడదు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వేడుకకు హాజరవుతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి వుంచిన ధనం మరొక దానికి వ్యయం చేస్తారు. సోమ, మంగళ వారాలలో పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు కలిసివస్తాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధన ప్రలోభం తగదు. కీలక సమావేశాలలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాగ్ధాటితో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులు కలిసివస్తాయి. బుధ, గురు వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. దంపతులు మధ్య దాపరికం తగదు. ఇంటి విషయాలు పట్టించుకోండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రయాణం తలపెడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-12-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడికి అభిషేకం చేస్తే...