Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29-11-2020 నుంచి 05-12-2020 వరకు మీ వార రాశి ఫలితాలు

webdunia
శనివారం, 28 నవంబరు 2020 (21:25 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరించాలి. భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఊహించని ఖర్చులు ధరలు ఆందోళన కలిగిస్తాయి. రాబడిపై దృష్టి పెడతారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభ కార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో చికాకులు ఎదురవుతాయి. సహోద్యోగులు సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రయాణంలో ఇబ్బందులెదుర్కొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. అనాలోచితంగా వ్యవహరించవద్దు. వ్యవహారాలు బెడిసికొట్టే ఆస్కారం ఉంది. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలపై దృష్టిపెడతారు. పత్రాలు అందుకుంటారు. దైవ దర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నిరంగాల వారికి శుభదాయకమే. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయాలు బలపడుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి రూపొందించిన ప్రణాళిక సత్ఫలితాలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యానుకూలత ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు జాగ్రత్త. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శని, ఆది వారాల్లో పనులు హడావిడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
భూ సంబంధిత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త, గుట్టుగా ఉండాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళ, బుధ వారాల్లో ధన సమస్యలెదురవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం విషయాల్లో శుభఫలితాలున్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చేతివృత్తులు కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. శనివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాస్తుకు అనుగుణంగా మరమ్మతులు చేపడుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. శ్రామికుల వ్యవహారం సమస్యాత్మకమవుతుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో కలుపుగోలుగా వ్యవహరించాలి. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వద్దు. ఖర్చులు విపరీతం. బంధుమిత్రుల కోసం వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఆది, సోమ వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్టాకిస్టులు, హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. సహద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. అవివాహితులకు శుభయోగం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ప్రతికూలతలు క్రమంగా సర్దుకుంటారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. మంగళ, బుధ వారాల్లో గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం చికాకు పరుస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ద వహిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంతమాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒకేసారి అనేక పనులతో సతమవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ అసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. కార్మికులకు సదావకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలదాయకమే. ప్రతికూలతలు తొలగుతాయి. వ్యవహారానుకూలత ఉంది. మాటతీరు ఆకట్టుకుంటారు. ధన యోగం కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. వేడుకల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలను తక్షణం విని యోగించుకోండి. సలహాలు సహాయం ఆశించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బందులుండవు. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. అనుకూలతలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ధన లాభం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం. గృహం సందడిగా ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవటం శ్రేయస్కరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల్లో మార్పు, పనిభారం. ఉపాధి పథకాలు సత్ఫలితాలిస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అదిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కేదారేశ్వర వ్రత కథ ఇదే.. ఆచరించే వారికి అన్నీ శుభాలే..!