మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. సర్వత్రా అనుకూలదాయకం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. మంగళవారం నాడు గుట్టుగా మెలగండి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం. సామరస్యంగా మెలగండి. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్తయత్నాలు మెదలెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. శుభకార్యానికి హాజరవుతారు. పరస్సరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. మీ నిజాయితీయే మిమ్ములను కాపాడుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. లావాదేవీలతో సతమతమవుతారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నమ్మిన వారే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ఉఖ్యం. అధకారులకు హోదామార్పు, వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్దలను సంప్రదించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించకోండి. ఇతరులను దరిచేరనీయవద్దు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉపాధ్యాయులకు స్థానలనం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. కార్మికుల ఆదాయం బాగుంటుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. ఆలోచలు పలు విధాలుగా ఉంటాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. శుభకార్యానికి హాజరవుతారు. పరస్సరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా శ్రమించండి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్ళకు గురికావద్దు. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. మీ పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. మిత్రులను సంప్రదించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. రాబోయే ధనానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఆదివారం నాడు అనవసర జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. హోల్సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ అనుకూలమే. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం చేస్తారు. శనివారం నాడు చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. నోటీసులు అందుకుంటారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు సదావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు బదిలీతో కూడిన స్థానచలనం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. స్వల్ప ఇబ్బందులెదురైనా యత్నాలు సాగించండి. మనోధైర్యంతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీరు తీసుకునే నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం ఆచితూచి అడుగేయాల్సిన సమయం. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆటంకాలు ఏదురైనా యత్నాలు నిలిపివేయొద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు ఏదో విధంగా నెరవేరుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం కార్మోన్ముఖులను చేస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సాఫ్ట్వేర్ రంగాల వారికి సదావకాశం లభిస్తుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ఫలిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కొంటుంది. ఆటంకాలు ఎదురైనా లక్ష్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల వ్యవహారంలో జోక్యం తగదు. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. అధికారులు మీ పదోన్నతికి సిఫార్సు చేస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకలు, విందులకు హాజరవుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. మంగళవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ప్రముఖుల సిఫార్సుతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. అనాలోచిత నిర్ణయం తగదు. సంతానానికి ఉద్యోగప్రాప్తి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమివ్రతులకు సంతోషాన్నిస్తుంది.