Publish Date: Tue, 31 May 2016 (22:27 IST)
Updated Date: Tue, 31 May 2016 (22:30 IST)
పి.ప్రశాంత్-ఖమ్మం: మీరు సప్తమి మంగళవారం, సింహలగ్నము, స్వాతి నక్షత్రం తురారాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ఆటంకాలు, అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతి శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించండి. దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ కాత్యాయిని దేవిని పూజించడం వల్ల బాగుగా కలిసిరాగలదు. 2018 నుంచి శని మహర్దశ 19 సంవత్సరములు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఏదైనా దేవాలయాలలో కానీ, ఉద్యానవనాల్లో మద్ది మొక్కను నాటిన దోషాలు తొలగిపోతాయి.
గమనిక: మీ సందేహాలను
[email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.