Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ నెలలో మీ రాశి ఫలితాలు... డాక్టర్ పి.ఎ. రామన్

జూన్ నెలలో మీ రాశి ఫలితాలు... డాక్టర్ పి.ఎ. రామన్

Advertiesment
జూన్ నెలలో మీ రాశి ఫలితాలు... డాక్టర్ పి.ఎ. రామన్
, మంగళవారం, 31 మే 2016 (20:12 IST)
మేషం- అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం:
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. కుటుంబీకుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెరిగిన ధరలు ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టం మీద ధనం సర్దుబాటవుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాల ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, బదిలీలు ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. విదేశీ చదువు యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణం కలిసివస్తుంది.
 
వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహారాలు, పనులు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధుమిత్రులతో అభిప్రాయ భేధాలు తలెత్తుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంతానం చదువులకోసం బాగా వ్యయం చేస్తారు. ఆలోచనలు కొలిక్కివస్తాయి. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థాన చలనం సంభవం. ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు ప్రోత్సాహకరం. గత అనుభవంతో ఒక సమస్యను అధిగమిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విలువైన వస్తువులు, పత్రాలు నగదు జాగ్రత్త.
 
మిధునం
మృగశిర 3, 4  పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. హామీలు, పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ ప్రతిపాదనకు అమోదం లభిస్తుంది. పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష
ఈ మాసం ప్రధమార్థం అన్నివిధాల యోగదాయకరం. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఒక పట్టాన పూర్తికావు. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుత్యాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. బంధుమిత్రులతో అకారణ కలహం, విభేదాలు తలెత్తుతాయి. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. వృత్తులవారికి అవకాశాలు  కలిసివస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులు, వ్యాపారాలు విస్తరణకు అనుకూలం. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ధనం అందుతుంది. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు స్థానచలనం, బాధ్యతల మార్పు తప్పదు.  అధికారులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి.
 
కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం ఆశాజనకమే. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు సర్దుకుంటాయి. రుణ విముక్తులవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అవసరాలు, కోరికలు నెరవేరగలవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనయోగం, ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. విదేశీ విద్యల పట్ల ఆకర్షితులవుతారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
తుల
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఈ మాసం ద్వితీయార్థం అనుకూలం. పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. అదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. అయినా వారే సాయం చేసేందుకు వెనుకాడుతారు. అవసరాలకు అతికష్టంమీద ధనం సర్దుబాటవుతుంది. ఉద్యోగస్తులకు ధనయోగం, పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. సహోద్యోగులతో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. వ్యవసాయ కూలీలకు ఆశాజనకం. 
 
వృశ్చికం
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్టం
వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఆర్థికస్థితి సామాన్యం. యత్నాలు ఫలించక, పరిస్థితులు అనుకూలించక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అధికం, ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులు హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలేయండి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అనుకూలిస్తాయి. ప్రయాణంలో చికాకులు తప్పవు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
ధనుస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పుదొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. సన్మాన, సాహిత్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం
ఉత్తరాషాడ 2, 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఈ మాసం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ శ్రీమతి వైఖరి వివాదాస్పదమవుతుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, సంబంధాలు బలపడతాయి. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ధనప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం. ఖర్చులు పెరిగిన భారమనిపించవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సమర్థతకు అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సహోద్యోగులతో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. అధికారులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలు, పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త వహించండి. రైతుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ప్రయాణంలో ప్రయాసలెదుర్కుంటారు. 
 
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి  
అన్ని రంగాల వారికి శుభదాయకమే. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పొగడ్తలు, మొహమ్మాటాలకు తలొగ్గవద్దు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. త్వరలో శుభవార్త వింటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, స్వస్థల చలన ప్రాప్తి. అధికారుల ప్రశంసలందుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. 
- డాక్టర్ పి.ఎ. రామన్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలోని జపాలీ తీర్థంలో ఘనంగా హనుమాన్‌ జయంతి.. పోటెత్తిన భక్తజనం