Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17-10-2019 రాశి ఫలితాలు, సాయిబాబా గుడిలోని ధునిలో రావి సమిధలు వేస్తే శుభం

webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (08:09 IST)
మేషం: బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. అనుకున్న పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. అనుకున్న పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.
 
వృషభం: వస్త్రాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. ముందుచూపుతో వ్యవహరించండి. వాహన సౌఖ్యం పొందుతారు. భాగస్వామిక వ్యాపారాలలో కష్టనష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.
 
మిధునం: గృహారంభ, ప్రవేశాలు, విహాది శుభకార్యలలో పాల్గొంటారు. దైవకార్యాలో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. పన్నులు, వడ్డీలు, పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలు లభిస్తాయి. విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
 
కర్కాటకం: కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు అనువైన సమయం. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలురావచ్చు. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.
 
సింహం: ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఇచ్చిపుచ్చేకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
కన్య: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసలుబాటు ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల: హోటల్, క్యాటరింగ్ పనివారలకు ఒత్తిడి. చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. గృహోపకరణాలు చేస్తారు.
 
వృశ్చికం: ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోచ్చు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు స్వీకరిస్తారు.
 
ధనస్సు: ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం: ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి. మీ భార్య మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
కుంభం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. ఓ కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటంతో సంతృప్తిని పొందుతారు.
 
మీనం: పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

అక్టోబర్ 17, 2019 గురువారం వర్జ్యం, రాహు కాలం, యమ గండం ఎప్పుడెప్పుడు?