Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-02-2022 ఆదివారం రాశిఫలితాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో ఆరాధిస్తే..

Advertiesment
13-02-2022 ఆదివారం రాశిఫలితాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో ఆరాధిస్తే..
, ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (05:00 IST)
శ్రీ ప్లవనామ సం|| మాఘ శు|| ద్వా దశి సా.6.05 ఆరుద్ర ఉ. 9. 15 రా.వ. 10.26 ల 1211. సా.దు. 422ల 507. ఆదిత్యుని ఎర్రని పూలతో ఆరాధించిన శుభం కలుగుతుంది. 
 
మేషం: - ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
వృషభం :- మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియ జేయండి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒడిదుడుకులు తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
మిధునం:- పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించడంవల్ల పనులు వాయిదావేసుకుంటారు. మీ బంధవులను సహాయం అగ్గించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. పొగడ్తలు, మొహమాటాలకు దూరంగా ఉండాలి.
 
కర్కాటకం:- శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరతాయి. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. తలచిన కార్యముల్లో జాష్యం , అధికమైన ఖర్చులను ఎదుర్కొంటారు.
 
సింహం:- ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి అందుకుంటారు.. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. జూదాల్లోధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు.
 
కన్య:- విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఉత్సాహం, ఏకాగ్రత ఏర్పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి.
 
తుల - ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యం, తరుచు విందు భోజనాలు వంటి శుభ సంకేతాలున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలిసివస్తాయి.
 
వృశ్చికం:- పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. బంధువుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. నిరుద్యోగులు గడచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకుండా వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.
 
ధనస్సు: - రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొబ్బరి, పండు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్ని సమస్యలు చిన్నావే అయినమనశ్శాంతి దూరం చేస్తారు.
 
మకరం:- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
కుంభం:- ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసేయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
మీనం:- మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రావలసిన ధనం వాయిదా పడుతుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం రోజున జయ ఏకాదశి.. పూజ ఇలా చేస్తే సర్వం శుభం