Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-02-2022 శుక్రవారం రాశిఫలితాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల ...

Advertiesment
Daily Horoscope
, శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (04:00 IST)
మేషం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు సంభవిస్తాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
వృషభం :- మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మిథునం :- వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. స్త్రీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రులతో విభేదాలు తీరతాయి.
 
కర్కాటకం :- రావలసిన బాకీలు వసూలు కాకపోవటంతో ఆందోళన చెందుతారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. మీ శ్రమకు తగిన ప్రోత్సాహం, ప్రతిఫలం పొందుతారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
సింహం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది.
 
కన్య :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి పొందుతారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల :- స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. స్త్రీలకు తల పెట్టిన పనులు వాయిదా పడతాయి. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
వృశ్చికం : - ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా రాబడి విషయంలో పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
ధనస్సు :- ఒకానొక విషయంలో మిత్రుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది. మీ యత్నాలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మకరం :- ఉద్యోగస్తులు ప్రమోషన్లకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ స్థాయి పెరుగును. మీ వాగ్దాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలు షాపింగులో నాణ్యతను గమనించాలి.
 
కుంభం :- నిర్మాణ పనుల్లో బిల్డర్లకు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మీనం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. అత్యవసరమైన సమయంలో కావలసిన పత్రాలు కనిపించకపోవచ్చు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్‌లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు: టీటీడీ గుడ్‌న్యూస్