Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-02-2022 మంగళవారం రాశిఫలితాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Advertiesment
Daily Horoscope
, మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (04:00 IST)
మేషం :- రాజకీయనాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్థిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం :- మీ పనితీరు, వాగ్దాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. విశేషాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి.
 
మిథునం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
కర్కాటకం :- రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులు ప్రకటనలపట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ కళత్ర వైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
తుల :- ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభదాయకం. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
వృశ్చికం :- శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతతాయి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోవడం వల్ల మాటపడక తప్పదు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను.
 
ధనస్సు :- కానివేళలో బంధుమిత్రుల రాక ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బఠాయిల వసూళ్ళలో అధికమైన సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు మంచిది కాదని గమనించండి.
 
మకరం :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది కాదు. మీ ఆంతరంగి విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఏది జరిగినా మంచికేనని భావించండి. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం :- స్త్రీలకు ఆర్జన పట్ల, విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రావలసిన ధనం వసూలుకు బాగా శ్రమించాలి.
 
మీనం :- రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-02-2022 సోమవారం రాశిఫలితాలు - పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించిన...