Publish Date: Tue, 30 Dec 2025 (04:00 IST)
Updated Date: Mon, 29 Dec 2025 (21:42 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటటాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు పురమాయించవద్దు. అనవసర జోక్యం తగదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా శ్రమించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. విలాసాలకు ఖర్చుచేస్తారు. కీలక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో విభేదిస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆపన్నులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పొగిడే వారితో జాగ్రత్త. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్న కార్యం సాధిస్తారు. స్థిరచరాస్తుల ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వేడుకను ఘనంగా చేస్తారు. శుభవార్త వింటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రయాణం కలిసివస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహబలం ప్రతికూలంగా ఉంది.. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. చిన్న విషయానికే చికాకుపడుతుంటారు. పనులు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రావలసిన ధనం సమయానికి అందుతుంది. రుణవిముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. మీ కృషి ఫలిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీదైన రంగంలో పురోగమిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి.