Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-03-2026 ఆదివారం ఫలితాలు - మీ తప్పిదాలను సరిదిద్దుకునే..?

Advertiesment
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకూలతలు నెలకొంటాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. స్థిరాస్తి ధనం అందుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నింటా మీదే పై చేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఆత్మీయులు ప్రోత్సాహం అందిస్తారు. ఖర్చులు అధికం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఓర్పుతో మెలగండి. వివాదాలు పరిష్కారమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. బంధువర్గంతో విభేదిస్తారు. ఎవరినీ తప్పుపట్టవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు నిర్ణయం పునఃపరిశీలించుకోండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. అనవసర విషయాల జోలికి పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. జూదాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, అకాల భోజనం, కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వాయిదాలు చెల్లింపుల్లో జాప్యం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని అవకాశాలు యాదృచ్ఛికంగా కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బడ్జెట్ వేసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పత్రాల్లో సవరణలు అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-03-2026 నుంచి 28-03-2026 వరకు మీ వార ఫలితాలు- ఎవరికి లాభం?