Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

Advertiesment
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కొత్తయత్నాలు చేపడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ధనానికి ఇబ్బంది ఉండదు. కాలక్షేపం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు వివరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త పనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందుపుచ్చుకోండి. ఇతరులతో మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక వుండదు. పనిభారం, విశ్రాంతిలోపం, పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి బాగుంది. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎవరిపైనా భారం వేయవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నగదు ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తాడు. అందరితోను మితంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు.
 
ధనుస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెంటాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ముఖ్యల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, చుట్టుపక్కల వారిని గమనించండి. పనులు మందకొడిగా సాగుతాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ఆర్భాటాలు, భేషజాలకు పోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖల సందర్శనం వీలు పడదు. మొండి. ధైర్యంతో ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు