Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేదీ 19-02-2023 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని మంకెనపూలతో పూజించిన...

Advertiesment
Pisces
, ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఉద్యోగస్తులకు ట్రాన్సఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. 
 
వృషభం :- చిట్స్, ప్రైవేటు ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. స్థిరాస్తిని అమర్చుకుంటారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. 
 
మిథునం :- కీలకమైన విషయాలు మీ జీవిత భాగస్వామికి తెలియచేయటం మంచిది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. రుణాల కోసం అన్వేషిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. పోస్టల్, ఎల్.ఐ.సి. ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
కర్కాటకం :- పండ్లు, కొబ్బరి వ్యాపారులకు కలసివస్తుంది. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు.
 
సింహం :- కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దైవ, సేవా కార్యక్రమాలలో ఇబ్బందులు తప్పవు. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్తులు, అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు.
 
కన్య :- కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. బంధువులు, ఆత్మీయులరాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులమధ్య మనస్పర్ధలు వస్తాయి. విద్యార్థులు అధిక కృషి అనంతరం మంచి ఫలితాలను సాధిస్తారు.
 
తుల :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయ సంపాదన దిశగా మీ ఆలోచన లుంటాయి. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
వృశ్చికం :- దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చు తప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు.
 
ధనస్సు :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఖర్చులు అధికమవుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు తప్పవు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాల వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
మకరం :- ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. రాబోయే ఖర్చులకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు యత్నిస్తారు.
 
కుంభం :- ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. పత్రికా సిబ్బంది మార్పుల కోసంచేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులకు మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
మీనం :- ఆదాయ వ్యయాల్లో ఆచితూచి వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగాలందు ఆశించిన ఆదాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మందలింపులు, విమర్శలను ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు శుభదాయకం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-02-2023 నుంచి 25-02-2023 వరకు మీ వార రాశిఫలాలు