Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేదీ 15-02-2023 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం..

Advertiesment
astro2
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు. 
 
వృషభం :- ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రావలసినమొండి బాకీలు సైతం వసూలుకాగలవు. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. సొంత వ్యాపారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు. 
 
మిథునం :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలలో శ్రమాధిక్యత తప్పదు. నిత్యవసర వస్తు ధరలు అధికమవుతాయి. బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపులభిస్తుంది.
 
కర్కాటకం :- స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి సఖ్యత అంతగా ఉండదు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. నిర్మాణ పనులు చురుకుగా సాగటంతో మీలో సంతృప్తి కానవస్తాయి. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. సన్నిహితులతో కలిసి దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
సింహం :- సన్నిహితులతో కలిసి వినోదాలలో పాల్గొంటారు. అనుకోకుండా నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేతి వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, మెకానికల్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
కన్య :- ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి, చికాకులు వంటివి అధికం. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బ్యాంక్ వ్యవహారాలలో కొత్త సమస్యలు తలెత్తగలవు. 
 
తుల :- నిరుద్యోగులు చిన్న సదావకాశము లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞులను సంప్రదించండి. చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి.
 
వృశ్చికం :- పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్త్రీలకు ఎదుటివారి విషయాలపట్ల ఆశక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. నిర్ణయాలు, అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఆర్ధిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
మకరం :- మీ ప్రయాణాలు ఇతరుల కారణంగా వాయిదా పడటంతో నిరుత్సాహానికి లోనవుతారు. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ధనవ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మీనం :- బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుకాలంలో నోటికి తాళం వేస్తే..?