Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేదీ 10-02-2023 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన...

Advertiesment
Aquarius
, శనివారం, 11 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- స్త్రీలకు షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
వృషభం :- హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. తలట్టిన పనులుఆలస్యమైనా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులుతప్పవు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి.
 
మిథునం :- కాంట్రాక్టర్లకు సదావకాశాలు లభించినా ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి.
 
కర్కాటకం :- టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి చికాకులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వైద్య రంగాలవారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
సింహం :- స్త్రీల లక్ష్య సాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రుల కలయికతో గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు.
 
కన్య :- పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. బంధువుల రాకతో హడావుడిగా పనులు ముగిస్తారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలేఆస్కారం ఉంది. మీ శ్రీమతి సలహా పాటించటం శ్రేయస్కరం. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. విద్యార్థుల తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు తప్పవు.
 
తుల :- దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. విద్యుత్ రంగాల్లో వారికి పని భారం అధికమవుతుంది. స్త్రీలు అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. క్రీడ, కళ, సాంస్కృక రంగాలపట్ల ఆసక్తి వహిస్తారు. రాబడికి మించి ఖర్చులుంటాయి. హోదాలో ఉన్న అధికారులకు ఆకస్మిక స్థానచలనం తప్పదు.
 
వృశ్చికం :- కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది.
 
ధనస్సు :- ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లోని అయిన వారి క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
మకరం :- ప్రైవేట్ ఫైనాన్స్, చిట్స్ సంస్థల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. సేల్స్ సిబ్బందితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో అనునయంగా మెలగాలి. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. 
 
కుంభం :- బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో లోపం వల్ల నష్టాలు చవిచూడవలసి వస్తుంది. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. పాతమిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు వ్యవహరించ వలసివస్తుంది. కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. రాజకీయాలలోని వారు ఆచి తూచి వ్యవహరించవలెను. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 13న శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల