Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేదీ 17-02-2023 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజిస్తే శుభం...

Advertiesment
astro3
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (04:00 IST)
మేషం :- దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మెళుకువ వహించండి. హీమీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కొన్ని విషయాలలో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
వృషభం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలోవారికి మిశ్రమ ఫలితం. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్తి, పొగాకు రైతులకు నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. మీ ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర ఆర్యోగం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొబ్బరి, పండు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండగలదు. 
 
కర్కాటకం :- మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. 
 
సింహం :- ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక స్థిరాస్తిని అమ్మాలి అనే ఆలోచన అధిమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
కన్య :- కళ, సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు కృషి చేయాలి. నూతన పరిచయాలు ఏర్పరచుకుంటారు. స్త్రీలు షాపింగ్ నాణ్యతను గమనించాలి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరంచేస్తారు. సమావేశాలకు ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. 
 
తుల :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. సోదరులతో విభేధాలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
 
వృశ్చికం :- స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. మిమ్ములను పొగిడే వారిని ఓ కంట కనిపెట్టటం ఉత్తమం. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ధన సహాయం చేసిన తిరిగిరాజాలదు.
 
ధనస్సు :- సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఆపద సమయంలో సన్నిహితులు ఉండగానిలుస్తారు. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్థిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించినంత మార్పు లేకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురౌతారు.
 
మకరం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. క్రీడ, కళ, సాంస్కృక రంగాల పట్ల ఆశక్తివహిస్తారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు వంటివి తలెత్తగలవు.
 
కుంభం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. బంధువులు నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
మీనం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల అవగాహన, ధ్యేయం పట్ల ఏకాగ్రత ఏర్పడతాయి. నిర్మాణ పనులు, మరమ్మత్తులలో ఏకాగ్రత వహించండి. రాజీ ధోరణితో వ్యవహరించటంవల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌర్ణమి రోజున రాశిని బట్టి స్నానం.. కన్యారాశి వారు ఏలకులను నీటితో కలిపి..?