Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Advertiesment
Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారిగా కుంగిపోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త, గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్ధికలావాదేవీలు ముగుస్తాయి. రుణ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల బాధ్యతలు. చేపట్టి అవస్థలెదురుంటారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యతిరేకుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు హడావుడిగా సాగుతాయి. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆచితూచి అడుగేయాలి. యాదృచ్ఛికంగా పొరపాటు దొర్లే అవకాశం వుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. లావాదేవిలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. పత్రాల సవరణలను అనుకూలం. కొన్ని సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త, వాదోపవాదాలకు దిగవద్దు. పత్రాలు అందుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. మీ వాక్కు ఫలిస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సాయం ఆశించవద్దు. ధనసమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ప్రయాణం తలపెడతారు
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువులు రాక చికాకు పరుస్తుంది. పనుల్లో శ్రమ అధికం. దంపతుల మధ్య కలహం. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
లక్ష్యాన్ని సాధిస్తారు. సర్వత్రా అనుకూలం. మాట నిలబెట్టుకుంటారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం సన్నగిల్లుతుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు చెల్లింపులో జాగ్రత్త. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం