Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

Advertiesment
Amavasya
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా యత్నాలు సాగిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోనుఖ్ములను చేస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా కలిసివచ్చే సమయం, దర్యం ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం, ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఇతరుల సాయం ఆశించవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. చీటికిమాటికి అసహనం చెందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పసులు వేగవంతమవుతాయి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబీకులను సంప్రదిస్తారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. గృహమార్పు అనివార్యం 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. సభ్యత్వాలు స్వీకరణకు అనుకూలం వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉన్నతిని చాటుదోవటానికి. విపరీతంగా న్యాయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు. నోటీసులు అందుకుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. శుభకార్యాన్ని ఆర్బాటంగా చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తాం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అందరిని ఇబ్బంది కలిగించిన సమస్య పరిష్కారమవుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు  అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకంగా సాగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు ఇతరులకు పురమాయించవచ్చు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ఆహ్వానం అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఏకాగ్రతతో శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం, పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రబోభాలకు లొంగవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ధైర్యంగా యత్నాలు కొనసాగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది