Publish Date: Wed, 13 May 2026 (05:03 IST)
Updated Date: Wed, 13 May 2026 (13:17 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఖర్చులు విపరీతం చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక వీలుపడదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు సానుకూలనువుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ప్రకటనలు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు, నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం, కృషి ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ పెట్టండి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందని రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలం, ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు చేపడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా వస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా ఖర్చు చేయండి. దంపతులు మధ్య దాపరికం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త నోటీసులు అందుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ధనసహాయం తగదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు, లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రలోభాలకు గురికావద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోదరులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త ఆరోగ్యం బాగుంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకోవటానికి శ్రమించండి. అనవసర వ్యాపకాలు పెట్టుకోవద్దు. రోజు వారి ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ప్రియతములతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభఫలితాలున్నాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పొగిడే వారితో జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.