Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

09-01-2023 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం...

Advertiesment
Scorpio
, సోమవారం, 9 జనవరి 2023 (04:00 IST)
మేషం :- ఆదాయానికి మించి ఖర్చులు అధికం కావడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృషభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బాధల్లో మీ మనోభావాలు, మీ ఆలోచనలు, బయటికి వ్యక్తం చేయకండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులవల్ల అపనిందలు, అపవాదులు ఎదుర్కొంటారు. మీ నీతి, నిజాయితీకి గుర్తింపులేక పోవడం వల్ల అశాంతికి లోనవుతారు. 
 
మిథునం :- వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. రవాణా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. ఆస్థి వ్యవహారాలలో సోదరులతో పోరు అధికమవుతుంది. ఎదుటివారిని బాగుగా గౌరవిస్తారు. కాంట్రాక్టర్లు అధికారులను సంతృప్తి పరచడం వల్ల సత్ఫలితాలు లభించగలవు. 
 
కర్కాటకం :- ధాన్యం, కంది, మినుము, నూనె, మిర్చి, ధనియాల వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు శుభదాయకంగా ఉండగలదు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందులకు లోనవుతారు. రచయితలు, పత్రికా, మీడియా రంగాలవారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలలో జయం మిమ్మల్ని వరిస్తుంది.
 
సింహం :- బంధువులను కలుసుకుంటారు. సినిమా, కళా రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు రాగలవు. విద్యార్థులకు తోటివారి కారణంగా చదువుల్లో ఏకాగ్రత లోపం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కన్య :- బంధువుల రాకతోగృహంలో సందడి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రైవేటు రంగాలలో వారికి ఇంజనీరింగ్ రంగాలలో వారు అశాంతికి లోనవుతారు. అకాలభోజనం వల్ల స్త్రీలకు ఆరోగ్యం మందగిస్తుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తడం వల్ల ఆశాంతి తప్పదు. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించటం క్షేమదాయకం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నూతన పెట్టుబడులపట్ల ఏకాగ్రత వహిస్తారు. మీడియా రంగాల్లో వారికి, పత్రికా రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. పండ్ల, పూల, కొబ్బరి చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. రాజకీయాలలోని వారికి కార్యకర్తలవల్ల సమస్యలు తలెత్తగలవు.
 
ధనస్సు :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టటం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రాజకీయాలలోనివారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తగలవు. మీ కుటింబీకుల విషయంలో సంతృప్తి కానరాదు.
 
మకరం :- రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు తమ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి.
 
కుంభం :- బంధు మిత్రుల ధోరణి మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. నిరుద్యోగులకు సత్కాలం ఆసన్నమైనది. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. రాజకీయాలలోనివారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. స్త్రీలు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. షేర్ల కొనుగోళ్ళు మునుముందు లాభిస్తాయి. కుట్టు పనివారికి, పనివారితో సమస్యలు తలెత్తగలవు. మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-01-2023 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివడం వల్ల...