Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

05-01-2023 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన మీ సంకల్పం...

Cancer
, గురువారం, 5 జనవరి 2023 (04:00 IST)
మేషం :- గృహంలో సందడి నెలకొంటుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యం. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
వృషభం :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఓ వార్త మిమ్ములను ఆశ్చర్య పరుస్తుంది. స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారితీస్తుంది. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
 
మిథునం :- విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందలింపులు తప్పవు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. సమావేశాల్లో మీకు గుర్తింపు లభిస్తుంది. దైవదర్శనంలో చికాకులు ఎదుర్కుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. సంతానం భవిష్యత్తు పట్ల మరింత శ్రద్ధ అవసరం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కోవలసి వస్తుంది. సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోను పాల్గొంటారు. బలహీనతలు అదుపులో ఉంచుకోండి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
సింహం :- వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
 
కన్య :- ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. అధికారులకు హోదా మార్పు స్థానచలనం. ఉద్యోగస్తులకు ధనలాభం, పదోన్నతి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితులు అనుకూలతలు ఉంటాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు.
 
తుల :- ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఓర్పుతో వ్యవహరించండి. పరిచయంలేని వారితో జాగ్రత్త అవసరం. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పని ఒత్తిడి తప్పవు. స్త్రీలకు షాపింగ్ పట్ల ఆశక్తి పెరుగుతుంది. మీ మాటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి.
 
ధనస్సు :- రాజకీయవర్గాలకు కొద్దిపాటి ఒత్తిడులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. ఆశ్చర్యకరమైన సంఘటనలు, విలువైన వస్తువులు సేకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సోదరుల నుంచి మాట సహకారం అందుతుంది.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. అస్తవ్యస్త పరిస్థితులను కొలిక్కొ తెచ్చుకుంటారు. పరిశోధనా విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు, ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిమీద ఏకాగ్రతవహించలేరు.
 
కుంభం :- ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం అధికమవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది.
 
మీనం :- రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు తప్పవు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. మీ సంతానం విద్యా, ఆరోగ్యం విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-01-2023 బుధవారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం..