మేషం: – సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. శుభాకాంక్షలు తెలియజేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి
వృషభం :- ఆర్ధికంగా కుదుటపడతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి బాగుంటుంది. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. అందరితో కలిసి వేడుకలు, విందులు, వినోదాలలో పాల్గొంటారు.
మిధునం:- బంధు మిత్రులు మీ ఉన్నతికి సహకరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. రావలసిన ధనం చేతికందడంతో పాటు ఖర్చులు అధికమవుతాయి. మీ నూతన ఆలోచలను క్రియారూపంలో పెట్టి జయంపొందండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
కర్కాటకం:- కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రుల రాకతో స్త్రీలకు పని భారం అధికమవుతుంది.
సింహం: – ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వాహనం నడపునపుడు జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి.
కన్య:- నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. స్త్రీలకు చుట్టుపక్కలవారితో సంబంధ బాంధ్యవ్యాలు నెలకొని ఉంటాయి. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఇతరులను ధనసహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. కళ, క్రీడ, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం.
తుల: – ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఖర్చులకు వెరవక ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
వృశ్చికం:- కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వాహనం వీలైనంత నిదానంగా నడపటం క్షేమదాయకం. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.
ధనస్సు:- వైద్య, న్యాయ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరీ సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. దైవకార్యాల్లో తరచుగా పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికిఉద్యోగం లభిస్తుంది.ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
మకరం:- ఆలయాలకు విరాళాలు అందిస్తారు. దూర ప్రదేశాల్లోనే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉపాధి పథకాలపై దృష్టి పెడతారు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటంఉత్తమం.
కుంభం:- ఊహించని సంఘటనలెదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఎటువంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి పంట దిగుబడి బాగుంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. మీ పట్టుదల ఎదుటివారికి స్ఫూర్తిదాయకమవుతుంది.
మీనం:– హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. గృహమార్పు లేదా స్థానచలనం అనివార్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. ఆధ్యాత్మిక చింతన పెంపొండుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.