Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

Advertiesment
astro8

రామన్

, బుధవారం, 8 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| చైత్ర ఐ॥ అమావాస్య ఉ.8.56 భరణి ప.2.02 రా.వ.1.35 ల 3.07. ప.దు. 11.31 ల 12.22.
 
మేషం :- రాబడికి మించిన ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మీ సంతానం విద్య, విషయాల పట్ల దృష్టి సారిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. బంధువుల రాకపోకలు చికాకుపరుస్తాయి.
 
వృషభం :- సోదరుల మధ్య ఆస్తి వ్యవహరాల ప్రస్తావన వస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. లీజు, ఏజెన్సీలు, టెండర్ల వ్యవహరాల్లో పునరాలోచన అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. విద్యార్థులకు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మిథునం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాల కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటర్ రంగా వారికి పురోభివృద్ధి. కొన్ని విషయాల్లో మీ అంచనాలు, ఊహలు తారుమారవుతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు.
 
కర్కాటకం :- కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఎంతటివారినైనా మీ వాగ్ధాటితో మెప్పిస్తారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలసివస్తాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు,
 
సింహం :- దైవ, సేవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. స్త్రీలకు సెంటిమెంట్లు, శకునాల ప్రభావం అధికం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రేమికులకు ఓర్పు, సమయస్ఫూర్తి బాగా అవసరం. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. 
 
కన్య :- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. వేడుకలు, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీరందిన కానకులు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. చెప్పుడు మాటలు మనస్తాపం కలిగిస్తాయి. ప్రైవేటు చిట్స్ నిర్వహకులకు ఖతాదారులతో సమస్యలు తప్పవు.
 
తుల :- అనుకున్న పనులు పట్టుదలతో శ్రమించి పూర్తి చేస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగదు. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. వాహనచోదకులకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. కార్యసిద్ధి, వృత్తి వ్యాపారాల్లో అనుకూలత వంటి శుభపరిణామాలు ఉంటాయి. 
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థుల్లో ఆందోళన తొలగి మనోధైర్యం నెలకొంటుంది. ఇతరుల విషయాలకు, వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
ధనస్సు :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాయకం. బంధు మిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నాఇబ్బందులుండవు. మార్కెటింగ్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
మకరం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఒకరికి సహాయం చేసిమరొకరి ఆగ్రహానికి గురవుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడంమంచిది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తి నివ్వగలవు. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
 
మీనం :- మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...