Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

Advertiesment
astro8

రామన్

, మంగళవారం, 7 మే 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| చైత్ర బ॥ చతుర్ధశి ఉ.10.59 అశ్వని ప.3.15 ఉ.వ.11.29 ల 12.59 రా.వ.12.22 ల 1.53, ఉ.దు.8.07ల 8.58రా.దు. 10. 48 ల 11.33.
 
మేషం :- చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు, చికాకులు ఎదుర్కుంటారు. దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. ప్రముఖులు, స్త్రీలతో మితంగా సంభాషించండి.
 
వృషభం :- బంధువుల ఆకస్మికరాకతో ఒకింత ఇబ్బందులు తప్పవు. మీ సంతానం పై చదువులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. స్త్రీలకు తమ మాటేనెగ్గాలన్న పంతం కూడదు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం.
 
మిథునం :- తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా ఆదాయాభివృద్ధి, పరిచయాలు విస్తరిస్తాయి. మీ లక్ష్యసాధనకు బాగా కష్టపడాలి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
 
కర్కాటకం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి అనునయంగా చెప్పటం మంచిది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి.
 
సింహం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు పనిభారం అధికం. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు.
 
కన్య :- దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
తుల :- ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృశ్చికం :- మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. పెద్దలు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. స్థిరాస్తి అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం. అప్రయత్నంగా కొన్ని వ్యవహరాలు అనుకూలిస్తాయి. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. వాహనం కొనుగోలుకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటానికి మరికొంత సమయం పడుతుంది. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు.
 
కుంభం :- ఉద్యోగస్తుల పనిలో ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఏజెంట్లకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు.
 
మీనం :- ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. ఉద్యోగస్తుల శక్తిసామర్ధ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. తలపెట్టినపనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని జయంతి.. అమావాస్య.. తైలాభిషేకం.. నలుపు రంగు దుస్తులు..?