Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-02-2026 గురువారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం...

Advertiesment
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయం అంతంతమాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాలు అందుకుంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి బాగుంది. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూలతలున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆశావహదృక్పధంతో మెలగండి. సాయం ఆశించవద్దు. బడ్జెట్ రూపొందించుకుంటారు. పనులు పురమాయించవద్దు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ధైర్యంగా ముందుకు సాగండి. అపోహలకు తావివ్వవద్దు. దంపతుల మధ్య ఆకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆప్రియమైన వార్త వినవలసి వస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నేడు అనుకూలదాయకం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మితంగా సంభాషించండి. కీలక విషయాల్లో ఆశ్రద్ధ తగదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. రావలసిన ధనం అందుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ