Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు- రుణ సమస్య పరిష్కారమవుతుంది

Advertiesment
Astrology

రామన్

, మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ఒక పట్టాన సాగవు, దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. దంపతుల ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. నగదు, విలువైన వస్తువులు వాగ్రత్త ఏకాగ్రతతో వాహనం నడవండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. పనులు పాదావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఇతరుల సాయం ఆశించవద్దు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పెద్దఖర్చు తగిలే అస్కారం ఉంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొకదానికి ఖర్చు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇతరుల జోక్యం తగదు. వ్వవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులు ఆదుకుంటారు. ఖర్చులు సామాన్యం.  బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రవాణా ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. మీ దృష్టి మరల్చేందురు కొందరు ప్రయత్నిస్తారు. వాహనం మరమ్మతుకు గురువుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. నిలిపివేసిన సనులు పూర్తిచేస్తారు. దూరపు బంధువులుతో సంభాషిస్తారు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొత్త పసులు మొదలెడతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు, ప్రభుత్వంగా పనులు పూర్తి చేస్తారు. సోదరులు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నేడు అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటినీ ఏమరుపాటుగా వదిలి వెళ్లకండి 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం, ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. రుణ సమస్య కొలిక్కి వస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఖర్చులు సామాన్యం. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్