Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిశెంబరు 20 మీ రాశి ఫలితాలు, ఏ పనులు పూర్తవుతాయి? ఏ పనులు వాయిదా?

Advertiesment
Astrology

రామన్

, శనివారం, 20 డిశెంబరు 2025 (10:52 IST)
మేషం: అశ్వని, భరణి, 1,2,3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
వృషభం
కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సత్కాలం సమీపిస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితో లక్ష్యాలు సాధిస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టవద్దు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. స్నేహబంధాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే వుంటాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పత్రాల రెన్యువల్ ను అశ్రద్ధ చేయకండి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన సాగుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఓర్పుతో పనులు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
అభీష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోను మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితో మితంగా సంభాషించండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మాకంగా అడుగులు వేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలు దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తిచేస్తారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనలుు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శుభవార్త వింటారు. స్థల వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. ఖర్చులు సామాన్యం. దంపతుల మధ్య అకారణ కలహం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు : సింహరాశికి ఆదాయం, వ్యయం ఎంత?