Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12-09-2020 శనివారం దినఫలాలు - శ్రీరాముడిని పూజిస్తే సర్వదా శుభం

webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థుల అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. ఏ విషయం లోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మిథునం : పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వాహన చోదకులకు చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. సంప్రదింపులు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
కర్కాటకం : స్త్రీలకు బంధు వర్గాల ఆదరణ, సహాయ సహకారాలు లభిస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మార్కెట్ రంగా వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తిచేస్తారు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఆకస్మిక ప్రయాణం ఆదోళన కలిగిస్తుంది. 
 
సింహం : స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనవయ్యంలో మితం పాటించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు. ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగా ఉంటుంది. 
 
కన్య : రుణ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, నష్టాలను అధికమిస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. మంచి చేసినా విమర్శలు తప్పవు. దైవకార్యాది సమావేశాల్లో పాల్గొంటారు. 
 
తుల : ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ నిరుత్సాహ పరుస్తుంది. మీ కృషికి కుటుంబీకులు, సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. 
 
వృశ్చికం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. దూరపు బంధువులతో ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆస్తి, కోర్టు భూ వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. దైవ, సేవా, పుణ్యకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
ధనస్సు : స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది. సంఘంలో పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు నిరుత్సాహపరుస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. రుణం కొంత మొత్తం తీర్చడంలో ఒత్తిడి నుంచి కుదుటపడుతారు. 
 
మకరం : ఫ్యాన్సీ, స్టేషనరీ, వస్త్ర వ్యాపారులకు కలిసిరాగలదు. ఏ యత్నం కలిసిరాక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. దైవదర్శనాలు చేసుకోగలుగుతారు. రావలసిన ధనం అందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకోగలవు. ఆరోగ్య విషయంలో సంతృప్తి కానరాదు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఎదుటివారి తీరును గమనించి ముందుకుసాగండి. గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. 
 
మీనం : కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడుతాయి. కోర్టు వ్యవహారాల్లో సంతృప్తికానరాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రేవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పని చేయడం క్షేమదాయకం. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందరూ కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. 

 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

11-09-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే...