Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-09-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే...

Advertiesment
11-09-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవికి కుంకుమార్చన చేస్తే...
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనకి ఇతరులు అవాంతరాలు ఎదుర్కొంటారు. 
 
వృషభం : ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుట వల్ల వల్ల ఆందోళనకు గురవుతారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. 
 
మిథునం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగడం మంచిది. మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఫైనాన్స్ చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతనోత్సాహం కానవస్తుంది. విదేశాలు వెళ్లే ప్రయత్నాలు సఫలీకృతులవుతారు.
 
కర్కాటకం : ఒకానొక సందర్భంలో మిత్రులు వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. అనుకున్న సమయానికి ధనం అందకపోవడంతో ఒడిదుడుకులు తప్పవు. ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అభివృద్ధికి బాగా శ్రమించవలసి ఉంటుంది. 
 
సింహం : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్లుతుంది. ధనం అధికంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఆశించినంత సంతృప్తినీయవు. ధనం అధికంగా వ్యయం చేసినా ఒక మంచి పని చేసిన తృప్తి ఉంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. క్రయ విక్రయాలు బాగున్నా అంత లాభసాటిగా ఉండవు. 
 
తుల : పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలకు అనుకూలం. సంఘంలో గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం మీకే అనుకూలిస్తుంది. భాగస్వామికచర్చల్లో మీ సూచనలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
వృశ్చికం : కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వస్తుంది. 
 
ధనస్సు : మొహమ్మాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు చాలా అవసరం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. విద్యార్థులకు అత్యుత్సాహం కూడదు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. 
 
మకరం : స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యంలో మెళకువ అవసరం. సమయానికి చేతిలో ధనం లేక ఇబ్బందులెదుర్కొంటారు. అన్ని సమస్యలూ ఒక్కసారిగా మీదపడతాయి. 
 
కుంభం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగా వారికి సామాన్యం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
మీనం : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. రేషన్ డీలర్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే బంపర్ ఆఫర్... ఆ పని చేస్తే భక్తులకు ఉచిత దర్శనం...