Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-02-2020 మంగళవారం రాశిఫలాలు (video)

webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (05:00 IST)
Astro
Astro
మేషం : మిమ్మలను పొగిడే వారిని ఓ కంట కనిపెట్టడం ఉత్తమం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు పెట్టిపోతల విషయంలో పెద్దల సహకారం అవసరం. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. 
 
వృషభం : కొత్తగా చేపట్టిన వ్యాపారాలు శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఒక ఖర్చుకు తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగించాల్సి వస్తుంది. ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అంలాకారాలు విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ యత్నాలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. 
 
మిథునం : అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కోర్టు వ్యవహారాలలో ఫీల్డర్లు, ఫ్లీడర్ల గుమస్తాలకు ప్రయాసలు అధికం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. ఉద్యోగస్తుల శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. 
 
కర్కాటకం : ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఖర్చులు అధికం కావడం వృధా ధన వ్యయం వల్ల నిరుత్సాహం చెందుతారు. ఆస్తి పంపకాలు విషయంలో పెద్దల జోక్యం అనివార్యమవుతుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. 
 
సింహం : పారిశ్రామిక రంగాల వారికి కార్మిక శాఖ అధికారులతో సమస్యలు తప్పవు. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లు విజయం సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగాసాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. 
 
కన్య : సందేహాలు వీడి నమ్మకంతో యత్నాలు సాగించండి. మిత్రులపై మీరు పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యే సూచనలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. 
 
తుల : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులకు మరింత సన్నిహితులవుతారు. నూతన పెట్టుబడులకు కావాల్సిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. విద్యార్థినులపై తోటివారి ప్రభావం అధికంగా ఉంటుంది. 
 
వృశ్చికం : ఆర్థిక కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆత్మీయులకు సహాయ సహకారాలందిస్తారు. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : వ్యాపారాల్లో మొహమ్మటాలుక తావివ్వకండి. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. చిట్స్, పైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. బ్యాంకు పనులు, నగదు విషయంలో జాగ్రత్త అవసరం. 
 
మకరం : కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయాణాలు అధికమవుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పోస్టల్, ఎల్.ఐ.సి, ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
కుంభం : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరగడంతో రుణయత్నాలు చేబదుళ్లు తప్పవు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
మీనం : ఆర్థిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. నూతన ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. 
 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

ఏ రోజుల్లో తలస్నానం చేయకూడదో తెలుసా?