క్షీణించిన వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం
ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా
ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరిలో వైపీ సుబ్బారెడ్డి ఎంపీ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి తరలించారు.
గత మూడు రోజులుగా న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఈ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన షుగర్, బీపీ లెవల్స్ పడిపోయినట్టు ఈ ఉదయం పరీక్షలు జరిపిన వైద్యులు ధ్రువీకరించారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సిఫార్సు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే