Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ వద్దన్న తర్వాతే బీజేపీ బాబు వద్దకెళ్లింది.. కాకమ్మ కబుర్లు చెబితే?

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసే అన్యాయాలను ఎండగట్టేందుకు.. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఏపీ సీఎం చంద్రబాబు వెన్నంటి నిలిచేందుకు ఢిల్లీ వెళ్లారు. హస్తినక

Advertiesment
జగన్ వద్దన్న తర్వాతే బీజేపీ బాబు వద్దకెళ్లింది.. కాకమ్మ కబుర్లు చెబితే?
, మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసే అన్యాయాలను ఎండగట్టేందుకు.. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఏపీ సీఎం చంద్రబాబు వెన్నంటి నిలిచేందుకు ఢిల్లీ వెళ్లారు. హస్తినకు వెళ్లిన చంద్రబాబు పార్లమెంట్ హాల్లో వివిధ పార్టీ నేతలను కలిశారు.

వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్‌, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌లు ఉన్నారు. వారందరితో మాట్లాడిన చంద్రబాబు కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూరుపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మోదీ గ్రాఫ్ ప్రకారం చంద్రబాబు మూడ్ మారుతుందని, మోదీ గ్రాఫ్ పెరిగితే, బీజేపీకి చంద్రబాబు మళ్లీ దగ్గరవుతారని వైసీపీ ఎంపీలు ఎద్దేవా చేశారు. 
 
పొత్తు కోసం టీడీపీ కంటే ముందు బీజేపీ జగన్‌నే సంప్రదించిందని వైసీపీ ఎంపీలు చెప్పారు. జగన్ వద్దన్న తరువాతే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుందని వైకాపా ఎంపీలు తెలిపారు. ఇన్ని రోజులు మోదీకి మద్దతుగా ఉండి నాలుగేళ్ల తరువాత అన్యాయం జరిగిందంటూ బాబు దూరం పెట్టారని విమర్శించారు. 
 
నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు, ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు అంటూ వైకాపా ఎంపీలు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వాళ్లకే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ప్రణమిల్లింది పార్లమెంట్‌కు కాదు... ప్రధాని నరేంద్ర మోడీకి