Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్మించి నట్టేట ముంచిన నమో : చంద్రబాబు ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు మాటలతో దాడి చేశారు. నమ్మించి నట్టేట ముంచారంటూ ఆగ్రహోద్రుక్తులయ్యారు. ప్రధానిగా నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన మేలు, చెడును వివరించ

Advertiesment
నమ్మించి నట్టేట ముంచిన నమో : చంద్రబాబు ఫైర్
, మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (08:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు మాటలతో దాడి చేశారు. నమ్మించి నట్టేట ముంచారంటూ ఆగ్రహోద్రుక్తులయ్యారు. ప్రధానిగా నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన మేలు, చెడును వివరించేందుకే తాను ఢిల్లీ వెళుతున్నట్టు ఆయన ప్రకటించారు. తన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు లేవని, కేవలం రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివిధ రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లి ఏపీకి న్యాయం జరిగేలా చూడటమేనని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'నా ఢిల్లీ పర్యటన రాజకీయాల కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఐదు కోట్ల మంది ప్రజల హక్కుల సాధన కోసం. మన సమస్యపై వీలైనంత మద్దతు కూడగట్టడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుంది' అని చెప్పారు. తాను పార్లమెంటుకు వచ్చి అక్కడే అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలను కలిసి మాట్లాడతానని, విడిగా ఏ పార్టీ నాయకత్వాన్నీ కలవబోనని ఎంపీలకు స్పష్టత ఇచ్చారు. 
 
ఇకపోతే, 'రాష్ట్ర విభజనలో మనకు అన్యాయం జరిగింది. దీనిని సరిచేయడానికి విభజన చట్టంలో 19 అంశాలు పెట్టారు. అవికాక విడిగా మరో ఆరు హామీలు ఇచ్చారు. ఇవి మన హక్కు. కానీ, అవేవీ సక్రమంగా నెరవేరలేదు. దానికి నిరసనగానే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. 
 
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏమిటి, ఎందుకు ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చామన్నది పార్లమెంటులో ప్రతి పార్టీకి వివరిస్తాం. వారి మద్దతును కోరతాం. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది. కానీ, వీళ్లు ఏకంగా నమ్మించి మోసం చేశారు. అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు విలువ లేదా? ఆ మాత్రం బాధ్యత వీరికి లేదా? దీని గురించి ప్రశ్నించేందుకే ఢీల్లికి వెళ్తున్నాను అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రార్థించే చేతులకన్నా సహాయం చేసే చేతులే గొప్ప... ఎమ్మెల్యే రోజా(వీడియో)