Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ అభ్యర్థి అనురాధను గెలిపించిన వైకాపా ఎమ్మెల్యేలు.. గుర్తించామన్న సజ్జల

sajjala ramakrishna reddy
, శుక్రవారం, 24 మార్చి 2023 (08:22 IST)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పసుమర్తి అనురాధను వైకాపా ఎమ్మెల్యేలు గెలిపించారు. దీన్ని వైకాపా పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంత సాహసానికి పాల్పడిన వారు ఎవరన్నదానికై సకల శాఖామంత్రిగా పేరుగడించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గుర్తించారు. వీరిపై సమయం వచ్చినపుడు చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
టీడీపీకి అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా, 19 మంది ఎమ్మెల్యేలే ఉండగా 23 ఓట్ల పోలయ్యాయి. మిగితా నాలుగు ఓట్లు ఎలా వచ్చాయన్న దానిపై వైకాపా మల్లగుల్లాలు పడుతోంది. నలుగురిలో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు ఓటు వేసి ఉంటారని భావించారు. మిగిలిన ఇద్దరూ ఎవరై ఉంటారన్న దానిపై అధికార పార్టీ దృష్టిసారించింది. ఇందులో రివిజన్ పేరుతో పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలెట్ పత్రాలను పరిశీలించి ఓ అవగాహనకు వచ్చింది. 
 
గత కొంతకాలంగా వైకాపాకు పక్కలో బల్లెంలా మారిన వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానని చెప్పారు. అనురాధ గెలుపొందిన వెంటనే శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరులోని వారి కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారు. 
 
రెండో వ్యక్తి నెల్లూరుజిల్లాకు చెందిన వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఈయన కూడా గత కొంతకాలంగా పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ను వైకాపా పెద్దలు ఎవరూ సంప్రదించలేదు. దీంతో ఆయన కూడా టీడీపీకే ఓటు వేసివుంటారని గుర్తించారు. 
 
వీరిద్దరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతే, కోస్తా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఒకరు వైకాపాకు వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైపాకు వ్యతిరేకంగా ఓటు వేసిన తమ ఎమ్మెల్యేలను గుర్తించామని, వారిపై సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహార ధాన్యాల పరంగా స్వీయ సమృద్ధి పరంగా శాస్త్రి గారికి దేశం ఋణపడి ఉంది: నరేంద్ర సింగ్‌ తోమార్‌