Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ వన్డే మ్యాచ్‌లో కలకలం సృష్టించిన #SaveAPFromYSRCP ప్లకార్డు

Advertiesment
youth placard
, మంగళవారం, 21 మార్చి 2023 (09:37 IST)
ఇటీవల విశాఖపట్టణం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫలితంతో నిమిత్తం లేకుండా ఇక్కడ ఓ విషయం చర్చించుకోవాల్సివుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ఒక ప్రేక్షకుడు ప్రదర్శించిన ప్లకార్డు ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. #SaveAPfromYSRCP అనే పేరుతో ప్రదర్శించిన ఈ ప్లకార్డు ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 
 
భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ యువకుడు ఈ ప్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొందరు వీటిని షేర్‌ చేస్తున్నారు. మరికొందరు వాట్సప్‌ల స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. వేలాది మంది ప్రేక్షకుల మధ్యలో ఈ తరహా ప్లకార్డు ప్రదర్శన కలకలం రేపుతోంది. 
 
గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైకాపా రాష్ట్రాన్ని అని రకాలుగా నాశనం చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసింది. ఇపుడు పరిపాలనా రాజధానిగా వైజాగ్‌ను చేస్తామంటూ కొత్త ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. దీంతో ఏపీ యువతలో వైకాపా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొనివున్నాయి. దీనికి ప్రతిరూపమే ఓ యువకుడు "సేవ్ ఏపీ ఫ్రమ్ వైకాపా" అనే ప్లకార్డును ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఐసెట్‌ 2023కు దరఖాస్తుల ఆహ్వానం