చంద్రబాబు బినామిలు రాజధానిమాటున భారీగా భూములు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీకి చెందిన వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాజధానికి చందాలుగా ఇచ్చిన ఇటుకలను, విద్యార్దుల చందాలను కూడా మాయం చేశారని ఆరోపించారు.
రూ. 9 వేల కోట్లు రాజధానికి వెచ్చించాం అన్నారు. మేం న్యాయం చేశాం అని టిడిపి ఎంపి అన్నారు. హైకోర్టు, తాత్కాలిక సచివాలయం రెండూ కూడా వర్షం వస్తే కారతాయి. తాత్కాలికం పేరుతో చంద్రబాబు అండ్ కో దోచుకున్నారు. పర్మినెంట్ అంటే లెక్కలు చూపించాల్సి వస్తుందని తెలుగుతమ్ముళ్లకు భయం. చంద్రబాబు చేసింది ఏమీ లేక గత 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకుంటూ వెళ్తున్నారు.
రాజధానిలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు. ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. కుంభకోణాల మయం చేశారు. బుద్దిహీనమైన ఆలోచనలు మానుకోని హుందాగా వ్యవహరించాలి. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలతో సాగుతున్నారు. రాజధానిని ఎలా నిర్మించాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు తెలుసు. మీలాంటి వారితో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు లేదు.
వైయస్ జగన్‌కు 45 ఏళ్లే అయినా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ గారికి ఏమీ కాదు. మీరు లేనిపోని ఆరోపణలు చేయడం, మాటలు మాట్లాడటం కాకుండా ప్రతిపక్షహోదాలో ప్రజలకు న్యాయం చేయండి. దళితులకు ప్యాకేజి ఇచ్చే విషయంలో మెట్టభూమి రైతులకు జరీబురైతులకు 1450 గజాలు ఇచ్చారు.
అసైన్డ్ రైతులకు ప్యాకేజి ఇచ్చే విషయంలో 600, 800, 1000 గజాలుగా ప్రకటించారు. అది కూడా మీకు బినామిలుగా ఉన్నవారు కొన్నతర్వాత పూలింగ్ నిర్ణయం తీసుకున్నారు. దళిత రైతులను సర్వనాశనం చేశారు. పూలింగ్‌కు తీసుకోకముందు వైయస్ జగన్ లింగాయపాలెం వచ్చి నేను అధికారంలోకి వచ్చాక మీకు న్యాయం చేస్తాను అన్న తర్వాత మీరు పూలింగ్‌కు తీసుకున్నారు. మీ స్వార్ద ప్రయోజనాలకోసం వాడుకుని రాజధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు.
మీ కుమారుడును తీసుకువచ్చి రాష్ట్రంపై రుద్ది ఈయన తదుపరి ముఖ్యమంత్రి అంటే మీ పార్టీ ఓ పక్కన డామేజ్ అయిపోయి ఉంటే ఈ పప్పును మేం ఎక్కడ మోస్తామని మీ పార్టీ నేతలే అంటున్నారు. మంచి ఆలోచన చేయాలని చంద్రబాబుకు హితవు పలుకుతున్నాం. బొండాఉమ మాటలు అందరికి తెలుసు. ఆయన అసెంబ్లీలో సైతం ఎలా మాట్లాడారో చూసారు. చంద్రబాబుకు వత్తాసు పలకాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయనకు రాజధాని గురించి తెలియదు.
చంద్రబాబు మాటలతోనే రాజధాని కట్టేశారని చెప్పాడు. రాజధాని అంతా చెట్లు మయం అయిపోయి ఉంది. రాజధానిని ఏమాత్రం అభివృధ్ది చేయలేదనేది మీరు అక్కడకు వస్తే తెలుస్తుంది. రాజధానిని మారుస్తానని వైయస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదు. రాజధానిని అభివృధ్ది చేస్తాం. ప్రస్తుతం అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబులాగా దుబారా చేయం. కొంతడెవలప్ చేసి ప్రజలకు ఇస్తే వారే డెవలప్ చేస్తారని మా ఉద్దేశ్యం.
చంద్రబాబు రాజధానిని శ్మశానంలా తయారు చేశారని అన్నారే వేరేగా చెప్పలేదే. ఏపి సంపాదన అంతా సింగపూర్‌లో దాచారు. సింగపూర్ లా కట్టాలి అంటే ఆర్థికంగా బాగా బలవంతులం అయిఉండాలి. అది గ్రాఫిక్స్ మాత్రమే. రాజధానిలో మాది ఉద్దండరాయుని పాలెం ఇప్పటికి కూడా పాములు, పుట్టలు ఉంటే గ్రాఫిక్స్ చూస్తే మాత్రం ఏదో జరిగినట్లు కనిపిస్తుంది.