ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసిపి పరాజయానికి ప్రధాన కారణమైందని ఆ పార్టీ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సరిగ్గా పదిరోజుల నుంచి ఈ చట్టంపై తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిందనీ, ఆ చట్టంతో ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందని చెప్పడంతో చాలామంది దాన్ని నమ్మేశారని అన్నారు.
తాము ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ చట్టంపై ప్రజలు తమను నిలదీసారనీ, ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. ఈ చట్టాన్ని ప్రస్తుతం పక్కన పడేయాలని చెప్పినా వినలేదనీ, అందువల్ల పార్టీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫోటో వేయడాన్ని కూడా గ్రామీణ ప్రజలు నిలదీశారని వెల్లడించారు. ఇలాంటి తప్పుల వల్ల పార్టీ పరాజయం అయ్యిందని అభిప్రాయపడ్డారు.