Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసేందుకు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని సిద్ధం (video)

Advertiesment
pemmasani-Ram Mohan

ఐవీఆర్

, ఆదివారం, 9 జూన్ 2024 (17:41 IST)
టీడీపీ నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఎంపికైన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం కోసం వారిరువురూ సిద్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఇక, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి లలన్ సింగ్, రాంనాథ్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. లలన్ సింగ్ ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, రాంనాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. భారతరత్న గ్రహీత కర్పూరీ ఠాకూర్ తనయుడే రాంనాథ్ ఠాకూర్.
 
ఆదివారం రాత్రి 7.15 గంటలకు మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ఎన్డీయే కూటమి నేతలు సమావేశమై, కేబినెట్ బెర్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 16 లోక్ సభ స్థానాలు గెలుపొందగా నాలుగు మంత్రిత్వ శాఖలు, స్పీకర్ పదవిని కోరింది. 12 సీట్లు గెలిచిన జేడియూ 2 శాఖలు అడిగింది. బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలిచి మేజిక్ ఫిగర్‌కు 32 సీట్ల (272) సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కేంద్రంలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కింగ్ మేకర్లు అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం : జి.కిషన్ రెడ్డి