చంద్రబాబుకి అది బాగా అలవాటు... అంబటి రాంబాబు ఫైర్..
జగన్ - మోడీతో జత కట్టారని... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి జగన్ సపోర్ట్ చేస్తారని గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు ఆరోపిస్తుండటం... కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు రావడం తెలిసిందే.
జగన్ - మోడీతో జత కట్టారని... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి జగన్ సపోర్ట్ చేస్తారని గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు ఆరోపిస్తుండటం... కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు రావడం తెలిసిందే. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ.. టీడీపీపై ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లుగా టీడీపీ అధికారంలో వుంది. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలని కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అన్నారు. బీజేపీతో వైసీపీకి పొత్తు అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోం.. ఒంటరిగానే పోటీ చేస్తాం అని స్పష్టం చేసారు.
కేసీఆర్‌తో కలిసి పని చేయాలి అనుకున్నాం అని చంద్రబాబు అంటున్నారు. కేసీఆర్‌తో కలిసి పని చేయాలి అనుకుంటే… యాభై లక్షలు ఇచ్చి రేవంత్ రెడ్డిని స్టీఫెన్‌సన్ దగ్గరకు ఎందుకు పంపారు అని ప్రశ్నించారు. రహస్య పొత్తులు పెట్టుకోవడం వైసీపీకి అలవాటు లేదు. బీజేపీతో ఏ విధమైన పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా లేనేలేము. రహస్య పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకి బాగా అలవాటు అని అన్నారు.
స్పీకర్ కోడెల కోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకి నోటీసులు వస్తే ధర్నాలు చేశారుగా… మరి.. కోడెలకు కూడా నోటీసులు వచ్చాయి. టీడీపీ వాళ్ళు ధర్నాలు చేయండి అన్నారు. ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా కోడెల అనర్హులు. స్పీకర్ కోడెలకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి కోర్టుకి వెళ్ళాలి అన్నారు. రాఫెల్ ఒప్పందం జరిగినప్పుడు చంద్రబాబు బీజేపీతోనే వున్నారు. బీజేపీతో మేము కలిసి ఉంటే… జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసు ఎందుకు పెట్టింది అని ప్రశ్నించారు. మరి.. అంబటి స్పందనపై టీడీపీ ప్రతిస్పందన తెలియచేస్తుందేమో చూడాలి.