Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమలో బీజేపీ, వైసీపీ, జనసేన... సోమిరెడ్డి

అమరావతి : సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేసినా జగన్, పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

ప్రేమలో బీజేపీ, వైసీపీ, జనసేన... సోమిరెడ్డి
, బుధవారం, 3 అక్టోబరు 2018 (21:19 IST)
అమరావతి : సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేసినా జగన్, పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వాళ్లు రాజకీయ నాయకులేనా? సీఎం చంద్రబాబు నాయుడును తిట్టడానికి పోటీపడుతున్న జగన్ మోహన్ రెడ్డికి, పవన్‌కు కేంద్ర ప్రభుత్వ తప్పిదాలు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి వాళ్లిద్దరూ అధికార ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రైతులకు, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించాలని కోరుతూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టారన్నారు. రైతుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోగా, వారిపై కేంద్ర ప్రభుత్వం దాడులకు దిగడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా జగన్, పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనడం లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడును తిట్టడానికి మాత్రం పోటీపడుతున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు రైతులపై జరిగిన దాడులను ఖండించలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
 
భారీగా పెరిగిన ఎరువుల ధరలు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాతే ఎరువుల ధరలు ఘననీయంగా పెరిగాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. డీఏపీ ధర 18.61 శాతం, ఎంవోపీ 64.35 శాతం, ఎన్.పి.ఎస్. 12.54 శాతం, ఎన్.పి.కె. 19.04 శాతం, ఎస్.ఎస్.పి. 31.25 శాతం పెరిగిందన్నారు. ఎరువుల ధరలు భారీగా పెరిగినా జగన్, పవన్ నోరెత్తడం లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడును తిడితే ఎరువుల ధరలు తగ్గుతాయా? అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. ఎరువులు మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయన్నారు. వాటి ధరలు తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. న్యూఢిల్లీలో డీజిల్ ధర 33.20 శాతం, హైదరాబాద్ లో రూ44.63 శాతం, ముంబైలో 25.02 శాతం కోల్ కత్తాలో 19.34 శాతం పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం దాడులకు దిగుతోందన్నారు. ఇవేవీ జగన్, పవన్‌కూ కనిపించడంలేదా అని మంత్రి ప్రశ్నించారు.
 
ప్రేమలో బీజేపీ, వైసీపీ, జనసేన
బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రేమలో పడ్డాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు కూడా రానివ్వబోమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అంటుంటే, సీఎం చంద్రబాబునాయుడు ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వనని పవన్ కల్యాన్ చెబుతున్నారని అన్నారు. వాళ్లద్దిరికీ భారీగా దోపిడీ చేసిన ఒక ముద్దాయి అధికారంలోకి రావాలని ఉందా...ఉంటే అదే విషయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడుపై ద్వేషం పెంచుకుని మాట్లాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రబాబునాయుడు అన్నారు. బీజేపీ అధికార పార్టీ ప్రతినిధులుగా జగన్, పవన్ మాట్లాడుతున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల ఆలయంలో వచ్చిన మార్పు… అయ్యప్ప ఆలయంలో వస్తే తప్పవుతుందా?